Sorry, nothing in cart.
విప్లవ కెరటం, ఉద్యమ శిఖరం
ఆధునికతకు ఇది కరవాలం!
సత్య సింహమై గర్జించినది విశాఖ తీరపు మహోగ్ర రాగం
పెళ పెళ పెళ పెళ ఉరుముల ధ్వనిగా వినిపించును ఈ విశ్వ విరావం
జగత్తుకంతా చెవులిస్తానని ప్రతిజ్ఞ చేసిన ఓ మహాకవి!
పేదల కడుపున ఆకలి మంటలు
ఆర్తనాదాలు ఆశాకిరణాలకు
నీ కవనాలే ప్రతిబింబాలు
చీకటి మాటున వెలుగును చూసి
వెలుగుల మాటున చీకటి వెతికి
భూత ప్రేతముల మనుగడ చూపి
క్రాంతి కీర్తనకు కలమును కదిపి
అరుణ వర్ణమును అరుదుగా వర్ణించు ఈ లోకం లో
సింధూరం రక్తస్యన్దనం బంధూకం సంధ్యా రాగం అంటూ అవధులు దాటి
అరుగుల మరుగున కరిగిన తెలుగు తేజమునకు
అందము అద్ది,